దేశంలో ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో దాదాపు 7 లక్షల మందిని కొత్త తరం పరిశ్రమలు ఆదుకొన్నాయి. ఆన్లైన్ మార్కెటింగ్, ఆహార సరఫరా సంస్థలు, ఆర్థిక సేవల సంస్థలు తాత్కా లిక ఉపాధి కల్పించాయి. ఆరు నుంచి ఎనిమిది నెలలపాలు ఈ ఉద్యోగాలు ఉండనున్నాయి. ఈ మొత్తం ఉద్యోగాల్లో 1,40,000ల ఉద్యోగాలను ఫ్లిప్ కార్ట్, అమెజాన్లు సృష్టించాయని ఇండియన్ స్టాప్ ఫెడరేషన్ అధ్యక్షురాలు రితుపర్ణ చక్రబర్తి పేర్కొన్నారు.