7న సీమ విద్యా సంస్థల బంద్


 రాయలసీమలో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 7న రాయలసీమ విద్యాసంస్థల బంద్ చేపడుతున్నట్లు రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ కన్వీనర్లు ప్రకాష్, శివ తెలిపారు. రాయలసీమ యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు కోసం ఉద్యమాలు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమన్నారు.