కాలుష్యానికి తావులేని, నిశ్శబ్ద విమానయానం కోసం అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) అడుగులు వేస్తోంది. పూర్తిగా విద్యుత్ తో నడిచే తన తొలి ప్రయోగాత్మక విమానాన్ని ఆ సంస్థ ఆవిష్కరించింది. వచ్చే ఏడాది ఇది గగనవిహారం చేయనుంది. ఎక్స్-57 'మ్యాక్సల్' అనే విమానం 2015 నుంచి అభివృద్ధి దశలో ఉంది. ఇటలీకి చెందిన పి2006టీ అనే లోహవిహంగానికి మార్పులు చేర్పులు చేసి నాసా దీన్ని సిద్ధం చేసింది.
నాసా నుంచి విద్యుత్తు విమానం