ఆంధ్రప్రదేశ్ లో రోడ్లను సత్వర మరమ్మతులు చేసేందుకు 625 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు AP CM వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రోడ్ల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను CM జగన్ ఆదేశించారు. ముఖ్యంగా విజయవాడ కనకదుర్గ వారధిని సత్వరం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.