అన్నదాతల ఆత్మహత్యల్లో తెలంగాణకు 6వ స్థానం


 పంట నష్టాలు, ఏటేటా పెట్టుబడులు పెరగడం..గిట్టుబాటు ధరలు లేకపోవడం..అప్పులు..ఇలా కారణాలు ఏమైనా అన్నదాత బలవన్మరణాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగో స్థానంలో ఉండగా, తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.