ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ షేన్ వాట్సన్ కు కీలక పదవి దక్కింది. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ కు వాట్సన్ ని అధ్యక్షడిగా నియమించారు. 10 మంది సభ్యులు ఉన్న ఈ బోర్డు బాధ్యతలు ఈ 38 ఏళ్ల మాజీ క్రికెటర్ కు అప్పగించారు. వాట్సతో పాటు ఆసీస్ ఆటగాళ్లు పాట్ కమ్మిన్స్, క్రిస్టన్ బీమ్స్, మాజీ క్రికెటర్ లీసా స్థాలేకర్ కి కూడా సభ్యులుగా చోటు దక్కింది. ఆరోన్ ఫించ్, అలీసా హేలీ, మొసిస్ హెన్రిక్స్, నీల్ మ్యా క్స్ వెల్, జానెట్ ట్రోనీ, గ్రెగ్ డైర్ ఇప్పటికే ఇందులో సభ్యులుగా ఉన్నారు.