బాలల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది google నిర్వహించిన డూడుల్ చిత్ర లేఖనం పోటీలో గురుగ్రామ్ కు చెందిన ఏడేళ్ల చిన్నారి దివ్యాన్షి సింఘాల్ మొదటి బహుమతి గెలుచుకుంది. ఈ చిన్నారి వేసిన పెయింటింగ్ నే Google డూడుల్ గా పెట్టింది. చెట్లను నరకడానికి వచ్చినప్పుడు అవి పారిపోతున్నట్లుగా సృజనాత్మక చిత్రాన్ని గీసింది. చిన్నారి సృజనకు, ఆలోచనకు ముచ్చట పడిన Google రూ.5లక్షల బహుమతిని ప్రకటించింది.
చిన్నారి గీసిన చిత్రానికి గూగుల్ 5లక్షల బహుమతి