దిల్లీ కాలుష్యం:5 వరకు పాఠశాలలు బంద్


 దేశరాజధానిలో కాలుష్యం నానాటికీ ప్రమాదకరస్థితికి చేరుతోంది. దీంతో దిల్లీ-NRC ప్రాంతంలో కాలుష్య నియంత్రణ మండలి 'ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి'ని ప్రకటించింది. నవంబర్ 5 వరకు నిర్మాణాలపై నిషేధం విధించింది. అంతేగాక, ఈ శీతాకాలం మొత్తం బాణసంచా పేల్చడంపై నిషేధం విధించారు. మరోవైపు కాలుష్యం దృష్ట్యా దిల్లీలోని పాఠశాలలకు నవంబర్ 5వరకు సెలవులు ప్రకటిస్తూ ఆ రాష్ట్ర CM అరవింద్ కేజీవాల్ ట్వీట్ చేశారు.