YCP ప్రభుత్వంపై మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని... విష జ్వరాలతో ప్రజలు చనిపోయినా పర్వాలేదా అని లోకేష్ విమర్శించారు. మరి రూపాయి జీతం మాత్రమే తీసుకుంటున్నానని బిల్డప్ ఇస్తున్న సీఎం జగన్ ఇంటి సోకులకు.. 5 నెలల్లో రూ.16 కోట్ల ప్రజాధనం ఎలా ఖర్చు చేశారో చెప్పగలరా? అని లోకేష్ ప్రశ్నించారు.
జగన్ సోకులకు 5 నెలల్లో 16 కోట్లు ఖర్చు:లోకేష్