RTC సమ్మెపై తుది తీర్పులో హైకోర్టు కీలక అంశాలను ప్రస్తావించింది. కార్మికులను విధుల్లోకి తీసుకునే విచక్షణను ప్రభుత్వానికి, RTC కే వదిలేస్తున్నామని వెల్లడించింది. సమ్మె చేస్తే కార్మికులు విధులను వీడినట్లుగా ప్రభుత్వం, RTC భావించొద్దని తెలిపింది. కార్మికుల కుటుంబాల గురించి కూడా ప్రభుత్వం, RTC ఆలోచించాలని సూచించింది. కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకోవడమనేది ఇక్కడ ప్రశ్న కాదని హైకోర్టు పేర్కొంది.
కార్మికుల కుటుంబాల గురించి ఆలోచించాలి: హైకోర్టు