కార్మికులకు ఉపాధి కల్పించే దారులను ప్రభుత్వం మూసేస్తోందని TDP అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కొందరు కూలీలు గుడుల్లోని ప్రసాదాలపై ఆధారపడటం చూసి బాధేస్తోందని ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇలాంటి దయనీయ పరిస్థితులు తెచ్చినందుకు వైసీపీ పాలకులు సిగ్గుపడాలి. కనీసం అన్నక్యాంటీన్ ఉన్నా ఈ పరిస్థితిలో కూలీలను ఆదుకునేది. సాకులు చెప్పకుండా వెంటనే అన్నక్యాంటీన్ లను తెరిచి పేదలను ఆదుకోండి.
వారిని అలా చూస్తే బాధేస్తోంది: చంద్రబాబు