నిర్దేశిత సమయంలోనే భారత కు ఎస్-400


 గగనతల రక్షణ వ్యవస్థ నిర్దేశిత సమయంలోగా భారత్ కు అందజేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. రష్యా నుంచి ఆయుధ కొనుగోలుపై అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వేళ పుతిన్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. "ఎస్-400 క్షిపణులను అందిచడంలో అంతా ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. అంతా సవ్యంగానే సాగుతున్నందున.. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మోదీ నుంచి కూడా ఎటువంటి ఒత్తిడి రాలేదు" అని పుతిన్ అన్నారు.