40వేల వజ్రాలు పొదిగిన టాయ్ లెట్


 వజ్రాలతో పొదిగిన బంగారపు టాయ్ లెట్ ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. చైనాలోని షాంఘైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. దీని ప్రత్యేకతలు చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ టాయ్ లెట్ పై భాగంలో కూర్చోడానికి దాదాపు 40వేలకు పైగా వజ్రాలతో(334.68 క్యారెట్ల) బుల్లెట్ ప్రూఫ్ సీటును తయారు చేశారు. దీని విలువ సుమారు రూ.9కోట్ల(1.3మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా వేస్తున్నారు.