భయంకరమైన ఈస్టర్ బాంబు పేలుళ్ల అనంతరం.. భద్రతా సవాళ్లతో పోరాడుతున్న శ్రీలంకలో అధ్యక్షుడి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నేడే ఈ ద్వీపదేశంలో పోలింగ్ జరగనుంది. కోటీ 59 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో 35 మంది నిలిచినా ప్రధాన పోటీ మాత్రం యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన సాజిత్ ప్రేమదాస, శ్రీలంక పోదుజన పెరామునా పార్టీకి చెందిన గోటబయా రాజపక్సల మధ్యే నెలకొంది.