భారత జోడీ ఓటమి ...


 చైనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత జోడీ (సాత్విక్, చిరాగ్) సెమీస్లో ఓటమి పాలైంది. ప్రపంచ నెంబర్ వన్ జోడీ మార్కస్ ఫెర్నార్డీ-కెవిన్ సంజయ(ఇండోనేషియా) చేతిలో 16-21, 20-22 తేడాతో పరాజితులయ్యారు. భారత జోడీ గట్టి పోటీనే ఇచ్చినప్పటికీ.. ఈ నెంబర్ వన్ జోడీ చేతిలో ఓటమి తప్పలేదు. ముఖ్యంగా రెండో గేమ్ లో సాత్విక్, చిరాగ్ గట్టి పోటీ ఇచ్చారు. ఆఖరికి 22-20తో గేమ్ తో పాటు మ్యాచ్ ను కూడా కోల్పోయారు.