టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్ కోస్లే నేడు 31వ పడిలోకి ప్రవేశించాడు. భార్య అనుష్కతో కలిసి భూటాన్లో బర్త్ డే జరుపుకుంటున్న కోహ్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాంత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, అజింక్య రహానే, కుల్దీప్ యాదవ్, మయాంక్ అగర్వాల్, మహ్మద్ కైఫ్, బొరియ మజుందార్, సురేశ్ రైనా తదితరులు కోహ్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక, అభిమానులైతే బర్త్ డే విషెస్లో సోషల్ మీడియాను మోతెక్కిస్తున్నారు.