నా ప్రతి రక్తపు బొట్టు తెలంగాణ కోసమే పోరాడింది


 చంద్రబాబుతో తనకు రోజూ పంచాయితీలే ఉండేవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. నల్ల నర్సింహులు విగ్రహావిష్కరణ సభలో CPU జాతీయ కార్యదర్శి నారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణకు సపోర్ట్ చేస్తేనే టీడీపీలో ఉంటానని చంద్రబాబుకు చెప్పానని, అందుకే తెలంగాణకు మద్దతుగా లేఖ ఇచ్చామని తెలిపారు. గతంలో KCR తో లేకున్నా తన ప్రతి రక్తపు బొట్టు తెలంగాణ కోసమే పోరాడిందని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని, CM తో మాట్లాడి సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు.