నాలుగేళ్లకోసారి మద్రాస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (MMA), అమాల్గమేషన్ గ్రూప్ సంయుక్తంగా అందిస్తున్న బిజినెస్ లీడర్‌షిప్ అవార్డును ఈ సంవత్సరానికి విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీకి అందించారు. పలు రంగాల్లో ఉత్తమ కృషికి గుర్తింపుగా ఈ పురస్కారంతో ఆయన్ను సత్కరించినట్లు అమాల్గమేషన్ గ్రూప్ ఛైర్మన్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ ఏడాదిగాను గురువారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో అజీమ్ ప్రేమ్ జీకి అందించారు.
అజీమ్ ప్రేమ్ జీకి బిజినెస్ లీడర్షిప్ అవార్డు