24 గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'బుల్ బుల్'


బంగాళాఖాతంలో బుల్‌బుల్ తుపాను కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందన్నారు. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.