నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భీష్మ'. సింగిల్ ఫరెవర్... అనేది ఉపశీర్షిక. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవలే తొలి వీడియో ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ "కొత్త రకమైన కథ, కథనం, సంభాషణలతో రూపొందుతున్న చిత్రమిది. వినోద ప్రధానంగా సాగే రొమాంటిక్ చిత్రమిది. భీష్మ ప్రేమ ఎలాంటిదో తెరపైనే చూడాలి. ప్రచార చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేశాయి" అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
'భీష్మ' ప్రేమ