2050 నాటికి 30 కోట్ల మంది సముద్రంలో మునక

 


ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర మట్టం పెరుగుదలతో విశ్వం అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని హెచ్చరించారు. ఈ పరిస్థితిని తిప్పికొట్టలేకపోతే 2050 నాటికి ప్రపంచంలో 300మిలియన్ల మంది ప్రజలు సమద్రాలు ఉప్పొంగి మునిగిపోతారని వెల్లడించారు. వాతావరణం వేగంగా మార్పు చెందుతోందని, ఇది భూమికి చాలా ప్రమాదకరమని వివరించారు.