జల్ జీవన్ మిషన్లో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. కేంద్ర జల్ శక్తి ఆధ్వర్యంలో జరిగిన దక్షిణాది ప్రాంతీయ సదస్సులో ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ పాల్గొన్నారు. జజీవన్ మిషన్ పథకం అమలుకు నిధులు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు కోరాయి. పథకం నిధుల కోసం నాబార్డ్, ఇతర ఆర్థిక సంస్థలను సంప్రదిస్తున్నాం. బడ్జెట్ కు లోబడి రాష్ట్రాలకు నిధులు సమకురుస్తాం. వీలైనంత వరకు స్థానిక నీటి వనరులనే ఉపయోగించాలి. 2024కల్లా ఈ పథకాన్ని పూర్తి చేయాలి"అని అన్నారు.