ఆర్థిక వ్యవస్థలో మందగమనం కొనసాగుతున్న పరిస్థితుల్లో, వచ్చే ఏడాది దేశీయంగా వేతనాల్లో 10 శాతం వృద్ధి ఉంటుందని వేతన ప్రణాళిక నివేదికలు రూపొందించే విల్లీస్ టవర్స్ వాట్సన్ అంచనా వేస్తోంది. 2019లో వాస్తవ వేతన పెరుగుదల 9.9 శాతంగా ఉందని, వచ్చే ఏడాది ఇది 10 శాతానికి ఉంటుందని తాజా నివేదికలో సంస్థ పేర్కొంది. వేతన పెరుగుదల 10 శాతం సమీపాన స్థిరపడుతోందని, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇది అధికమని తెలిపింది.