మోదీ ప్రభుత్వం చేసిన నోట్ల రద్దుకు నేటికి మూడేళ్లు. నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీని అడ్డుకోవడమే లక్ష్యంగా రూ.500, రూ.1000ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఆర్థిక నిపుణుడు ఆసక్తికర అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పటి పెద్ద నోట్ల స్థానంలో తెచ్చిన రూ.2000 నోటును కూడా ఇప్పుడు రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్.సి.గార్గ్ అభిప్రాయపడ్డారు. "వ్యవస్థలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉంది. రూ. 2000నోట్లను కూడా దాచి ఉంచుతున్నట్లు ఆధారాలున్నాయి.