భారత్, జర్మనీల మధ్య 20 కీలక ఒప్పందాలు...

 



 భారత్, జర్మనీల మధ్య 20 కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్ లో పర్యటిస్తున్న జర్మనీ చాన్సిలర్ ఏంజెలా మెర్కెల్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందాలు కుదిరాయి. ఉమ్మడి సంకల్ప ప్రకటన (జేడీఐ) కింద చేసుకున్న ఈ ఒప్పందాలతో... కృత్రిమ మేథస్సు (ఏఐ), విద్య, వ్యవసాయం, తీరప్రాంత సాంకేతికత సహా పలు రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించు కోనున్నట్టు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.