'జగనన్న విద్యా వసతి' పథకం కింద వసతి, ఆహార ఖర్చులకు ఏటా ఇవ్వబోతున్న రూ.20వేల ఆర్థిక సాయాన్ని సంబంధిత విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద సంక్షేమ వసతి గృహాలు, కళాశాలల అనుబంధ వసతి గృహాల్లో ఉండి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్థులకు సాయం అందిస్తారు.