వన్డే, టెస్టుల్లోకి ఎంపిక చేసేముందు యువకులను పరీక్షించేందుకు టీ20లు మంచి అవకాశమని టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్ శర్మ అన్నాడు. పొట్టి ఫార్మాట్లో తక్కువ విజయవంతం అవ్వడానికి కీలక ఆటగాళ్లు ఆడకపోవడమూ ఓ కారణమని వెల్లడించాడు. వన్డే, టెస్టులతో పోలిస్తే టీమిండియా టీ20ల్లో ఆశించిన మేరకు రాణించడం లేదు. గతేడాది వెస్టిండీస్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. దక్షిణాఫ్రికాతో సిరీస్ 1-1తో సమమైంది. తాజాగా బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ లో ఓటమిపాలైంది. తాజాగా బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ లో ఓటమిపాలైంది.
యువకులతో ప్రయోగాలకు టీ20లే మేలు:రోహిత్