మహా' తీరం దాటినా టీ20 నిర్వహిస్తాం!

 



తూఫాన్  హెచ్చరికలు ఉన్నప్పటికీ భారత్, బంగ్లా రెండో టీ20కి ఏర్పాట్లు చేస్తున్నామని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం తెలిపింది. వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తున్నామని వెల్లడించింది. మ్యాచ్ నిర్వహించేందుకు వీలుంటుందని ధీమా వ్యక్తం చేసింది. 'మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు మేం సంసిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తున్నాం. నవంబర్ 7న ఉదయం వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ మాత్రం సాయంత్రం మొదలవుతుంది' అని ఆ సంఘం అధికారి తెలిపారు.