2వేల కిలోమీటర్ల ఆవలికి కార్చిచ్చు సెగ


 అమెజాన్ వర్షాధార అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు ప్రభావం 2 వేల కిలోమీటర్లకు పాకుతోందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ అగ్నికీలల వల్ల దక్షిణ అమెరికాలోని ఆండెస్ పర్వతశ్రేణిలో హిమానీనదాలు కరిగిపోతున్నాయని పేర్కొంది. అడవులు కాలిపోవడం వల్ల వెలువడే మసి వంటి ఏరోసాల్ రేణువులు గాలి ద్వారా ఆండియన్ హిమానీనదాలకు చేరుతున్నాయని పరిశోధకులు తెలిపారు.