వైఎస్ఆర్ రైతు భరోసా కింద సాయం అందని రైతుల కోసం శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మొత్తం 2,85,469 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 1,38,868 ఫిర్యాదుల్ని అధికారులు అక్కడికక్కడే పరిష్కరించినట్లు వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాసాధికార సర్వేలో తమ పేరు నమోదు కాలేదని పేర్కొంటూ అత్యధికంగా అనంతపురం జిల్లాలో 8,686 ఫిర్యాదులు వచ్చాయి.
స్పందన కార్యక్రమంలో 2.85 లక్షల ఫిర్యాదులు