ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద రాష్ట్రానికి 2.58 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు రాయితీ అందిస్తుంది. ఇందుకోసం రూ.3,879 కోట్లు వ్యయం కానుంది. దిల్లీలో బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి మంజూరు, పర్యవేక్షణ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది.
పట్టణ పేదలకు 2.58 లక్షల ఇళ్లు