కొత్త శిఖరాలకు రిలయన్స్ షేరు..!


 రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు నేటి ట్రేడింగ్ లో కొత్త శిఖరాలకు చేరింది. ఒక దశలో 3.4% లాభపడి రూ. 1,508.45కు చేరింది. దేశంలోని తొలిసారి రూ.9.5లక్షల కోట్ల మార్కెట్ విలువను దాటిన సంస్థగా రికార్డు సృష్టించింది. దీంతో రూ.10లక్షల కోట్ల వైపు పరుగులు పెడుతోంది. అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న సంస్థగా రిలయన్స్ నిలిచింది. ఈ ఏడాది రిలయన్స్ షేరు ధర 35% వరకు వృద్ధి చెందింది.