మళ్లీ ఆ అవకాశం తనకే


 కొరటాల శివ దర్శకత్వంలో చిరు కథానాయకుడిగా ఇటీవలే ఒక చిత్రం ప్రారంభమైంది. అందులో ఇద్దరు నాయికలకి చోటుండబోతోందని తెలిసింది. పలువురు నాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చినా, త్రిష ఎంపిక దాదాపు ఖాయమైందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి త్రిష సంతకం చేయనున్నారట. చిరు - త్రిష ఇదివరకు 'స్టాలిన్' చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే.