అంతరిక్ష కేంద్రానికి 12 బాటిళ్ల వైన్

 



అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి డజన్ రెడ్ వైన్ బాటిళ్లు చేరుకున్నాయి. అయితే ఇవి ISO లో  ఉంటున్న వ్యోమగాముల కోసం కాదు.. పరిశోధనలకు మాత్రమే. రెడ్ బోర్డియక్స్ వైన్ భూమికి తిరిగి చేరుకునే ముందు అక్కడ ఒక ఏడాది పాటు ఉండనుంది. భార రహిత స్థితి, అంతరిక్ష రేడియేషన్.. వైన్ తయారీ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపనుందో పరిశోధనలు చేపట్టనున్నారు. పగిలిపోకుండా ఉండేందుకు బాటిళ్లను ప్రత్యేకంగా తయారుచేశారు.