మిషన్ గగన్యోన్ భాగంగా అంతరిక్షయానం కోసం ఎంపిక చేసిన 60 మందిలో 48 మంది IAF ఫైలెట్లను రష్యన్ శాస్త్రవేత్తలు పక్కన పెట్టారు. తుది జాబితాను 12మందికి కుదించారు. ఈ పన్నెండు మందిలో కేవలం ముగ్గురు మాత్రమే మిషన్ గగన్యోన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్తారు. దంత సమస్యల కారణంగానే 48 మంది ఫైలెట్లను రష్యన్ శాస్త్రవేత్తలు పక్కన పెట్టారని IAF అధికారి వెల్లడించారు.గగన్ యాన్ కోసం భారత ప్రభుత్వం దాదాపు 10,000 కోట్లు కేటాయించింది.