కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చిన 12 ఏళ్ల బాలికను పోలీసులు అడ్డుకున్నారు. తమిళనాడుకు చెందిన ఈ బాలిక తన తండ్రి, ఇతర బంధువులతో కలిసి ఈ ఉదయం శబరిమలకు రాగా.. పంబ ప్రాంతంలో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఆధార్‌కార్డులో బాలిక వయసు /2 సంవత్సరాలుగా ఉండటంతో ఆమెను అడ్డుకున్నారు. బాలికను అనుమతించేది లేదని, కుటుంబసభ్యులు అయ్యప్ప దర్శనం చేసుకుని తిరిగివచ్చేంతవరకు ఆమెకు బేస్ క్యాంప్ వద్ద భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు.
శబరిమల దర్శనానికి 12 ఏళ్ల బాలికను అడ్డుకున్న పోలీసులు