ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో IT సంస్థ టెక్ మహీంద్రా రూ.1,/24 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.1,064.3 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 5.6 శాతం ఎక్కువ. ఇక మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.8,629.8 కోట్ల నుంచి 5.7 శాతం పెరిగి రూ.9,070 కోట్లకు చేరింది. డాలర్ల ప్రాతిపదికన చూస్తే.. కంపెనీ లాభం /58.6 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆదాయం 1.28 బిలియన్ డాలర్లుగా ఉంది.
టెక్ మహీంద్రా లాభం రూ.1124 కోట్లు