దేశంలోనే ఎత్తైన శివలింగాన్ని తిరువనంతపురంలో ప్రతిష్టించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న ఈ శివలింగం సోమవారం నుంచి భక్తుల పూజలు అందుకోనుంది. 111 అడుగుల మహా శివలింగానికి దేవాలయ మఠాధిపతి మహేశ్వరానంద స్వామి తొలిపూజ చేశారు.