దశాబ్దంలో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా భారత్


 దేశంలోని ఆవిష్కర్తల ప్రతిభతో రానున్న 10-15 ఏళ్లల్లో భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. దిల్లీలో డెఫ్-కనెక్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాబోయే కాలంలో రక్షణ ఆవిష్కరణలలో భారత్ రాణిస్తుందని వెల్లడించిన రాజ్ నాథ్ సింగ్, అంకురాల స్థాపనకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోందని గుర్తు చేశారు.అంకుర సంస్థలు సత్ఫలితాలు ఇవ్వడం ఆనందంగా ఉందన్న ఆయన భవిష్యత్తులో రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని వెల్లడించారు.