ఫార్చూన్ వెల్లడించిన బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్-2019 జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అగ్రస్థానంలో నిలిచారు. మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా, అరిస్టా అధిపతి జయశ్రీ ఉల్లాలు కూడా ఈ జాబితాలో చోటు చేసుకున్నారు. సత్య నాదెళ్లతో పాటు బంగా, ఉల్లాలు కూడా భారత సంతతికి చెందిన వ్యక్తులు కావడం విశేషం. అత్యుత్తమ లక్ష్యాలు సాధించి; అసాధ్యమైన సవాళ్లను ఎదుర్కొని; వినూత్న పరిష్కారాలు కనుగొన్న 20 మంది అత్యుత్తమ వ్యాపారవేత్తలను ఈ జాబితాకు ఎంపిక చేసినట్లు ఫార్చూన్ వెల్లడించింది.
సత్య నాదెళ్ల నెం.1