త్వరలో అందుబాటులోకి వాట్సాప్ కొత్త ఫీచర్స్


 ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తేనుంది. ఇప్పటి దాకా రిజిస్టర్ చేసుకున్న డివైజ్ లో మాత్రమే వాట్సాప్ లాగిన్ కాగలం. వేరొక డివైజ్ లో లాగిన్ అవ్వాలనుకుంటే గతంలో రిజిస్టర్ అయిన డివైజ్ నుంచి ఆటోమేటిక్ గా లాగ్ అవుట్ అవుతుంది. దీంతో ఒకేసారి ఒక్కటి కంటే ఎక్కువ డివైజ్ లలో లాగిన్ అవటం సాధ్యపడదు. అయితే మరికొద్ది వారాలలో ఒకేసారి వేర్వేరు డివైజ్ లలో లాగిన్ అవ్వగలిగే ఫీచర్ ని వాట్సాప్ అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం.