ఆ టైమ్ కూడా వచ్చేసింది: రాజ్ నాథ్


రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చిన శనివారంనాడే కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ 'ఉమ్మడి పౌరస్మృతి' (కామన్ సివిల్ కోడ్-యూసీసీ) అంశాన్ని ప్రస్తావించారు. యుసీసీపై మీడియా అడిగిన ప్రశ్నకు రాజ్ నాథ్ స్పందిస్తూ 'ఆ టైమొచ్చింది' అని అన్నారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు వచ్చే సోమవారంనాడు విచారణ చేపట్టనుందని ఆయన తెలిపారు.