పింక్ బాల్ టెస్ట్...టికెట్ల డబ్బులు వాపస్


 టీమిండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య నగరంలోని ఈడెన్ గార్డెన్‌లో జరిగిన రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో చివరి రెండు రోజులు టిక్కెట్టు కొనుక్కున్న క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, ఆ రెండు రోజుల(నవంబర్ 25,26) కోసం ముందుగానే టికెట్లు తీసుకున్న ప్రేక్షకులకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు ప్రకటించింది.