ఛత్తీస్ గఢ్ లోని అంబికాపూర్ నగరపాలక సంస్థ నిరాశ్రయుల కోసం దేశంలోనే తొలిసారి గార్బేజ్ హోటలను అందుబాటులోకి తెచ్చింది. ఈ కేఫను రాష్ట్ర మంత్రి టీఎస్ సిన్హదేవ్ లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడ భోజనం లేదా అల్పాహారం చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. చేతినిండా ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకెళ్తే సరిపోతుంది. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నగరానికి విముక్తి కల్పించాలనే సంకల్పంతో అక్కడి అధికారులు ఈ కేఫను ఏర్పాటు చేశారట. కిలో ప్లాస్టిక్ వ్యర్థాలకు భోజనం, అరకిలో ప్లాస్టిక్ వ్యర్థాలకు అల్పాహారం పెడుతున్నారు.
ఆ హోటల్ లో తింటే డబ్బు కట్టనక్కర్లేదు