రష్యా : మరో వజ్రాన్ని తన గర్భంలో దాచుకున్న వజ్రం తొలిసారిగా మానవుని కంటపడింది. రష్యా ప్రభుత్వ వల వెలికితీత సంస్థ అల్ రోసా పీజేఎస్సీ నిర్వహిస్తున్న గనుల్లో ఇది దొరికింది. వజ్రం గర్భంలో మరో వజ్రం అటూ ఇటూ స్వేచ్ఛగా కదులుతూ ఉండటం గమనార్హం. ఈ వజ్రం దాదాపు 800 మిలియన్ సంవత్సరాల నాటిది అయివుండవచ్చని అల్ రోసా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ తరహా వజ్రం కనిపించడం ఇదే తొలిసారని, దీన్ని 'మట్రోష్కా డైమండ్'గా వ్యవహరిస్తారని తెలిపింది. ఈ వజ్రం 0.62 క్యారెట్లుండగా, లోపలున్న వజ్రం 0.02 క్యారెట్లుందని వెల్లడించింది.
అరుదైన ఆ వజ్రం అక్కడే దొరికింది