నష్టాల్లో మార్కెట్


దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినప్పటికీ... ఆ నిర్ణయం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరచలేక పోయింది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 433 పాయింట్లు పతనమై 37,673కు పడిపోయింది. నిఫ్టీ 139 పాయింట్లు కోల్పోయి 11,174కి దిగజారింది.