ఉపాసన కొణిదెల కు మహాత్మ గాంధీ అవార్డు

 ఈ గాంధీ జయంతి తమ కుటుంబానికి ఎంతో ప్రోత్సాహన్నిచ్చిందని అంటున్నారు ఉపాసన కొణిదెల. ఓ వైపు అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్ పర్సన్‌గా, మరోవైపు కొణిదెల ఇంటి కోడలిగా ఆమె ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఆమెలోని సామాజిక బాధ్యతను గుర్తించి ఓ ప్రైవేటు సంస్థ వారు ఆమెకు మహాత్మా గాంధీ అవార్డును అందించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఉపాసన సోషల్‌ మీడియావేదికగా పోస్ట్ చేశారు.