మోదీ, జిన్ పింగ్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి


 చెన్నై: ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పర్యటనకు తమిళనాడులోని మహాబలిపురం ముస్తాబవుతోంది. ఈ నెల //వ తేదీ నుంచి 3 రోజులపాటు ఇద్దరు నేతలు వివిధ అంశాలపై ఇక్కడ చర్చించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. కొద్దిరోజుల నుంచి మహాబలిపురం సముద్ర తీరంలోని కడైకరై ఆలయం, ఐదు రథాల ఆలయాలు, అక్కడి శిల్ప సంపదను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.