'సైనా' వీసా కష్టాలు


భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వీసా కష్టాలు ఎదుర్కుంటోంది. వచ్చే వారంలో జరగనున్న డెన్మార్క్ ఓపెన్ టోర్నీలో ఆడేందుకు వీసాకు దరఖాస్తు చేసింది సైనా. "హైదరాబాద్ లో నా వీసా అప్లికేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు సెలవైనా.. నా విన్నపాన్ని మన్నించి ప్రక్రియ కొనసాగిస్తున్నందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులకు కృతజ్ఞతలు. శుక్రవారం డెన్మార్క్ పయనమవ్వాల్సి ఉంది.. ఈ లోపు వీసా వస్తుందని ఆశిస్తున్నా" అని ట్వీట్ చేశారు.