' బాహుబలి', 'విన్నర్', 'ఎమ్.సి.ఎ', 'జై లవకుశ', 'గూఢచారి' చిత్రాల్లో సహనటుడిగా కనిపించారు రాకేష్ వర్రె. ఆయన హీరోగా, నిర్మాతగా నిర్మించిన చిత్రం 'ఎవ్వరికీ చెప్పొద్దు'. “నేను కన్న కలని నిజం చేసేందుకు మా నాన్న రిటైర్ అవ్వాల్సిన వయసులో నన్ను నిర్మాతని చేశారు. లింగం, కులం తదితర అంశాలపై సాగే ఈ చిత్రం ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది" అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ “చిన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తారు. 'ఎవ్వరికీ చెప్పొద్దు' మరో కొత్త ట్రెండ్ ని సృష్టిస్తుంది" అన్నారు.